స్నేహితులే.. ప్రేమికులవ్‌ను!

పెళ్లైన కొన్ని జంటల్ని చూస్తే ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’లా భలే ఉన్నారే అనిపిస్తుంది. ఆ అనుబంధం గమనిస్తే.. వీళ్లు ప్రేమలో ఎప్పుడు పడ్డారు? ఎంత అన్యోన్యంగా ఎలా ఉంటున్నారు? అనే అనుమానమూ రాకమానదు. తొలిచూపు ప్రేమ, ఆన్‌లైన్‌లో లవ్వాట..

Updated : 07 Aug 2021 05:50 IST

పెళ్లైన కొన్ని జంటల్ని చూస్తే ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’లా భలే ఉన్నారే అనిపిస్తుంది. ఆ అనుబంధం గమనిస్తే.. వీళ్లు ప్రేమలో ఎప్పుడు పడ్డారు? ఎంత అన్యోన్యంగా ఎలా ఉంటున్నారు? అనే అనుమానమూ రాకమానదు. తొలిచూపు ప్రేమ, ఆన్‌లైన్‌లో లవ్వాట.. ఏవో జవాబులు తడుతుంటూనే ఉంటాయి. కానీ అసలు నిజం ఏంటంటే.. ముందు స్నేహితులుగా ఉన్న అమ్మాయి, అబ్బాయిలే మంచి రొమాంటిక్‌ జంట అనిపించుకుంటారట. ఈ విషయం మేం చెప్పడం లేదండీ బాబూ.. ‘సోషల్‌, సైకలాజికల్‌ అండ్‌ పర్సనాలిటీ’ అనే సంస్థ అధ్యయనంలో బయట పడిందీ వాస్తవం. నిండా ప్రేమలో మునిగిపోయిన ప్రతి మూడు జంటల్లో రెండు జంటలు ముందు దగ్గరి స్నేహితులే అయ్యి ఉంటారంటోంది ఈ ఆ సర్వే. ప్రేమలో పడ్డ 1,900 మంది యూనివర్సిటీ విద్యార్థులతో చిన్నపాటి చర్చలు, అధ్యయనం నిర్వహించిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడించారు. అందులో ‘మేం ప్రేమలో ఉన్నాం’ అని చెప్పిన వారిలో 68శాతం కుర్రకారు మా రిలేషన్‌షిప్‌ స్నేహంతో మొదలై విడదీయలేని అనుబంధంగా ఏర్పడిందని సెలవిచ్చారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని