OTT: అనుష్క శర్మ కంపెనీతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ రూ.400 కోట్లఒప్పందం!
ఈ క్రమంలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్.. ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మకు చెందిన ‘క్లీన్ స్లేట్ ఫిల్జ్మ్ ప్రటేట్ లిమిటెడ్’తో చేతులు కలిపాయి....
ముంబయి: భారత్‌లో ఓటీటీలకు ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో వీక్షకులను ఆకట్టుకునేందుకు వీడియో స్ట్రీమింగ్ సంస్థలు పోటీ పడుతున్నాయి. కొత్తతరం కంటెంట్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్.. ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మకు చెందిన ‘క్లీన్ స్లేట్ ఫిల్జ్మ్ ప్రవేట్ లిమిటెడ్’తో చేతులు కలిపాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.400 కోట్లని సమాచారం!
ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న క్లీన్‌స్లేట్ ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం ఎనిమిది సినిమాలు, వెబ్ సిరీస్‌లను విడుదల చేయాల్సి ఉంటుంది. తర్వాత మరో 18 నెలల్లో మరికొన్ని చిత్రాలు, సిరీస్‌లు విడుదల చేయాల్సి ఉంటుందని సంస్థ సహవ్యవస్థాపకుడు, అనుష్క సోదరుడు కర్నేశ్ శర్మ బ్లూమ్‌బర్గ్‌తో చెప్పారు. ఈ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ ధ్రువీకరించింది. అమెజాన్ ఇంకా స్పందించలేదు. ఇరు సంస్థల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే వరకు మరిన్ని వివరాలను వెల్లడించబోమని కర్నేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్