Crime news: సేలంలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన 4 ఇళ్లు!

తమిళనాడులోని సేలం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరుంగల్‌పట్టిలో నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. భారీ వర్షాలకు నానిపోయిన పాత ఇళ్లు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ....

Published : 24 Nov 2021 01:15 IST

సేలం: తమిళనాడులోని సేలం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరుంగల్‌పట్టిలో నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. భారీ వర్షాలకు నానిపోయిన పాత ఇళ్లు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా కుప్పకూలగా.. ఆ ఇళ్లలో నివసిస్తున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికుల సహాయంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఇప్పటివరకు 13మందిని వెలికితీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మరో నలుగురు ఇంకా శిథిలాల కింద ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు.

మరోవైపు, తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, మదురై, రామనాథ్‌పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కరైకల్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని