Road Accident: వారంలో కూతురు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

వారంలోనే కూతురు పెళ్లి.. ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. దసరా పండుగ రోజునే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కుటుంబ పెద్దని కబళించిన విషాద సంఘటన శుక్రవారం రాత్రి 10.30 గంటలకు 

Updated : 17 Oct 2021 07:14 IST


వెంగయ్య

ఇరుకుల్ల(కరీంనగర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: వారంలోనే కూతురు పెళ్లి.. ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. దసరా పండుగ రోజునే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కుటుంబ పెద్దని కబళించిన విషాద సంఘటన శుక్రవారం రాత్రి 10.30 గంటలకు కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ఇరుకుల్ల వంతెన సమీపాన రాజీవ్‌రహదారిపై చోటుచేసుకుంది. రూరల్‌ ఠాణా పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పచ్చవ వెంగయ్య(47) భార్య హేమలతతో కలిసి 20 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కరీంనగర్‌కు వచ్చి కిసాన్‌నగర్‌లో నివాసముంటున్నారు. ముగ్దుంపూర్‌ శివారులో ఇటుకబట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వెంగయ్యకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు వర్ష వివాహం శ్రీహరి లోహిత్‌తో ఈ నెల 23న పాలకొల్లులో జరిపించడానికి ముహూర్తం పెట్టుకొని పెళ్లిపత్రికలు అచ్చు వేయించి, బంధువులకు, స్నేహితులకు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దసరా పండగ సందర్భంగా ఇటుక బట్టీలవద్ద కూలీలను కలిసి వారికి పండుగ ఏర్పాట్లను చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారులో ఇంటికి బయలు దేరారు. ఇరుకుల్ల వాగు సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనం లైట్లతో రోడ్డుపైన ఉన్న డివైడర్‌ కనిపించక కారు డివైడర్‌ మీద నుంచి అవతలి వైపునకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. కారు బెలూన్లు తెరుచుకున్నప్పటికీ కారు వేగంగా ఉండటంతో వెంగయ్య వెనుక సీటులోకి ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వెంగయ్య అంత్యక్రియలు శనివారం సాయంత్రం కరీంనగర్‌లో జరిపించినట్లు ఆయన స్నేహితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని