crime news: పోలీసులపై దాడి.. యువకుడి అరెస్టు

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఓ యువకుడు పోలీసులపై దాడికి దిగాడు. దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌..

Updated : 25 Jul 2021 05:07 IST

దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఓ యువకుడు పోలీసులపై దాడికి దిగాడు. దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ శివ, హోమ్‌ గార్డ్‌ చిన్నాపై హరికృష్ణ అనే యువకుడు కత్తి, స్క్రూడైవర్‌తో దాడికి యత్నించాడు. పట్టణంలోని సంజయ్‌ కాలనీకి చెందిన హరికృష్ణ అతని తమ్ముడిపై దాడి చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చేరుకుని గొడవను ఆపడానికి ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన హరికృష్ణ పోలీసులపై దాడి చేశాడు.  ఈక్రమంలో కానిస్టేబుల్‌ శివ తప్పించుకోగా పక్కనే ఉన్న హోమ్‌గార్డ్‌ చిన్నా గొంతుపై గాయమైంది. దీంతో వెంటనే హోమ్‌గార్డ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు హరికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని