నిబంధనలు ఉల్లంఘించాడని పోలీసుల దాష్టీకం

నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌.. మరోసారి తెరపైకి వచ్చింది. కర్ఫ్యూ నిబంధనలు పాటించలేదని ఉన్నావ్‌ పోలీసులు ఓ బాలుడిపై కర్కశత్వం ప్రదర్శించగా....

Published : 23 May 2021 01:38 IST

లఖ్‌నవూ: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌.. మరోసారి తెరపైకి వచ్చింది. కర్ఫ్యూ నిబంధనలు పాటించలేదని ఉన్నావ్‌ పోలీసులు ఓ బాలుడిపై కర్కశత్వం ప్రదర్శించగా తీవ్రగాయాలపాలై అతడు మృతిచెందాడు. దీంతో ఉన్నావ్‌లో పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్పందించిన పోలీసు శాఖ ఇద్దరు కానిస్టేబుళ్లను, ఓ హోంగార్డును సస్పెండ్‌ చేసింది.

ఉన్నావ్‌లోని బంగర్మావ్‌ ప్రాంతానికి చెందిన బాలుడు (17) తోపుడు బండిపై కూరగాయలు విక్రయిస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే కర్ఫ్యూ సమయంలో ఇళ్ల ముందు కూరగాయలు విక్రయిస్తున్నాడంటూ స్థానిక పోలీసులు అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఠాణాలో బాలుడిని తీవ్రంగా కొట్టారు. గాయాలపాలై ఆరోగ్యం విషమించడంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర రాజధాని లఖ్‌నవూలో నిరసన చేపట్టారు. ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. ఇద్దరు కానిస్టేబుళ్లను, ఓ హోంగార్డ్‌ను సస్పెండ్‌ చేశారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు