logo
Published : 03/12/2021 04:58 IST

రైతుల వెతలపై ఇంత నిర్లిప్తతా?: మనోహర్‌


మాట్లాడుతున్న జనసేన నేత నాదెండ్ల

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఆవేదనలో ఉంటే కనీసం వారికి మేమున్నామన్న భరోసాను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని, ఇంత నిర్లిప్త ధోరణి గతంలో ఎన్నడూ చూడలేదని మాజీ శాసన సభాపతి, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో ఇరువురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, నష్టపోయిన పంటలను వివిధ జిల్లాల్లో పరిశీలించిన సమయంలో రైతుల ఆవేదన మనస్సును కలచివేసిందన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రంలో ఇవ్వండి.. పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్పడం ఏ తరహా పాలనకు నిదర్శనమని ప్రశ్నించారు. గత ఏడాది తుపానుకు సంబంధించిన పరిహారమే ఇప్పటికీ రైతులకు పూర్తిగా అందలేదని చెప్పారు. కొవిడ్‌ సంక్షోభం కారణంగా చితికిపోయిన పేదల నుంచి ఇళ్లకు సంబంధించి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల కష్టాలు, వైకాపా పాలన తీరును ప్రజలకు వివరించడానికి ఈ నెల 5న చెరుకుపల్లిలో తమ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు మనోహర్‌ పేర్కొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని