logo
Published : 03/12/2021 04:58 IST

విలీన పాఠశాలలకుమిగులు ఉపాధ్యాయులు

బాపట్ల డివిజన్‌లో ప్రయోగం విజయవంతం
ఈనాడు-అమరావతి

జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో  విలీనమైన 3,4,5 తరగతుల పిల్లలకు స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన చేయించటానికి, ఉపాధ్యాయుల కొరతను అధిగమించటానికి మిగులు ఉపాధ్యాయులను గుర్తించే పనిని జిల్లా విద్యాశాఖ వేగవంతం చేసింది. హైస్కూల్‌ కాంపౌండ్‌లో ఉన్న ప్రాథమిక స్కూళ్లతోపాటు దానికి 250 మీటర్ల దూరంలో ఉన్న  ప్రాథమిక, యూపీ పాఠశాలలను విలీనం చేశారు. వీటిల్లో కొన్ని పాఠశాలల పిల్లలు ప్రస్తుతం ఎక్కడైతే చదువుతున్నారో వారిని అక్కడే ఉంచి స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన చేయించాలని పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. విలీన పాఠశాలలకు పని ఒత్తిడి తగ్గించాలంటే నలుగురు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రభుత్వానికి విన్నవించుకుంది. ప్రభుత్వం మిగులు ఉపాధ్యాయులను గుర్తించి ప్రస్తుత విద్యా సంవత్సరానికి బోధనకు ఆటంకం లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు చేయాలని ఆదేశించింది. ఈప్రక్రియ  బాపట్ల డివిజన్‌లో గురువారం కొలిక్కివచ్చింది. ఇదే విధానాన్ని గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, నరసరావుపేట డివిజన్లలో కూడా ఒకటి  రెండ్రోజుల్లో పూర్తి చేయాలని ఆయా డివిజన్ల ఉపవిద్యాశాఖ అధికారులను జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవానీ ఆదేశించారు. బాపట్ల డివిజన్‌లో 64 మందిని సర్దుబాటు చేసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది లోపు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35, ఉన్నత పాఠశాలల్లో 75 మంది లోపు పిల్లలు ఉన్నచోట పనిభారం లేకుండా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లను గుర్తించి వారిని మిగులు ఉపాధ్యాయులుగా పరిగణించి విలీన పాఠశాలలకు సర్దుబాటు చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని