logo
Published : 03/12/2021 04:57 IST

అమ్మా.. బరువెక్కకే..

మహిళల్లో ప్రమాదకరంగా ఊబకాయం

అమరావతి, న్యూస్‌టుడే

ధునిక మహిళ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.. ముఖ్యంగా బరువుపట్ల అశ్రద్ధ చూపిస్తోంది. లావుగా ఉంటే బలంగా.. ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తోంది. ఫలితంగా ప్రమాదకర ఊబకాయంతో వ్యాధుల వలలోచిక్కి విలవిల్లాడుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మహిళల్లో ఊబకాయం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. వయస్సు.. ఎత్తుతో ఉండాల్సిన బరువుకంటే రెండు, మూడింతలు అధికంగా ఉండటంతో దీర్ఘకాలిక వ్యాధులు ముసురుకుంటున్నాయి. బరువును అదుపులో ఉంచుకుంటే అతివల ఆరోగ్యానికి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

* జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం అల్పాదాయ వర్గాల్లోని పురుషుల్లో ఊబకాయులు 5 శాతం ఉంటే.. మహిళలు 6 శాతంగా నమోదయ్యారు. అదే అధికాదాయ వర్గాలకు వచ్చేసరికి పురుషుల్లో ఊబకాయం 33 శాతం, మహిళలు 36 మంది మంది స్థూలకాయంతో ఇబ్బందిపడుతున్నారు.

జంక్‌ఫుడ్‌కు అలవాటై కళాశాల విద్యార్థినులు.. శారీరక శ్రమ, జీవనశైలిలో మార్పులతో గృహిణులు స్థూలకాయం బారినపడుతున్నారు. శరీర ద్రవ్యరాశి సూచిక(బీఎంఐ, బాడీ మాస్‌ ఇండెక్స్‌)ను ఎప్పటికప్పుడు చూసుకుంటూ పోషకాలతో కూడిన సమతుల ఆహారాన్ని మహిళలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


మానసిక బలం ఎంతో ముఖ్యం..

హిళలకు ముఖ్యంగా గర్భిణులకు అవసరానికి మించిన బలం(ఊబకాయం)కంటే మానసిక బలం ఎంతో ముఖ్యం. బరువును నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మానసిక బలం పొందడం సాధ్యమవుతుంది. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే ఎన్నోరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తేలికపాటి వ్యాయామాలు, ప్రోటీన్స్‌తో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. యోగా, ధ్యానం, ఏరోబిక్స్‌లాంటివి ఇంట్లోనే చేసుకుంటూ బరువు తగ్గవచ్చు. పిల్లలు, పెద్దలు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కుటుంబ కౌన్సెలింగ్‌కు వచ్చే దంపతులు.. అమ్మాయిలను పరీక్షించే సమయంలో వారి బరువును పరిశీలించి ఊబకాయం ఉంటే తగ్గించుకోవాలని సూచనలు చేస్తున్నాం.

- డాక్టర్‌ ఎం.శ్రావణి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు, విజయవాడ.


అధిక బరువుతో అన్నీ అనర్ధాలే..

ధిక బరువుతో అన్నీ అనర్థాలే ఉంటాయి. ముఖ్యంగా ప్రసవం సమయంలో శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. బరువు తగ్గట్లేదనే ఒత్తిడితో దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, రక్తపోటు బారినపడాల్సి వస్తోంది. గర్భం దాల్చిన తరువాత నుంచి ఆరోగ్యంపట్ల ముఖ్యంగా అధిక బరువుపై శ్రద్ధ చూపించాలని గర్భిణులకు ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా చైతన్యం పెంపొందిస్తున్నాం. సమతుల ఆహారాన్ని కూడా గర్భిణులు, బాలింతలకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ్‌ ద్వారా అందిస్తున్నారు. ఊబకాయంతో వచ్చే దుష్పలితాలు, అనారోగ్య సమస్యల బారిన మహిళలు పడకుండా ఆరోగ్య చైతన్యంతో వ్యవహరించాలి.

- డాక్టర్‌ జె.యాస్మిన్‌, డీఎంహెచ్‌ఓ, గుంటూరు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని