logo
Published : 03/12/2021 04:57 IST

గృహ నిర్మాణాలకురూ.250 కోట్లు విడుదల


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : గృహ నిర్మాణాలకు సంబంధించి రూ.250 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కానున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 10 వేల మందికి రూ.50 వేల చొప్పున జమ కానున్నట్టు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. డీఆర్డీఏ ద్వారా అదనపు రుణాలు మంజూరవుతున్న దృష్ట్యా మరింత పురోగతి సాధించాలన్నారు. కనీసం వారానికి 25 ఇళ్లకు పునాదులు పడేలా చూడాలన్నారు. తిరువూరు పట్టణ పరిధిలో నాలుగు లేఅవుట్ల మెరక కోసం నిధులు ఇచ్చినా, పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని కలెక్టర్‌ ప్రశ్నించారు. వీసీలో జేసీలు ఎల్‌.శివశంకర్‌, శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, కె.మోహన్‌కుమార్‌, మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, గృహ నిర్మాణ సంస్థ పీడీ రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని