logo
Published : 03/12/2021 04:57 IST

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట


తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరిని సత్కరిస్తున్న కంభంపాటి రామ్మోహన్‌, రామ్మోహన్‌, అర్జునుడు, తదితరులు

పెద్దఅవుటపల్లి(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని సంఘ అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి అన్నారు. అమెరికాలో ప్రవాసాంధ్రులకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో అంజయ్య చౌదరికి గురువారం రాత్రి గ్రామస్థుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. సభకు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్రాధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు మాట్లాడుతూ.. పెద్దఅవుటపల్లి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత అంజయ్య చౌదరికి దక్కుతుందన్నారు. ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ.. తానా సేవా కార్యక్రమాల ద్వారా అంజయ్య చౌదరికి మరింత పేరు ప్రఖ్యాతలు రావాలన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ విప్‌ కోన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్‌, దాసరి బాలవర్ధనరావు, విజయా డెయిరీ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, కలపాల కిరణ్‌, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని