logo
Updated : 03/12/2021 05:50 IST

‘అఖండ’ చిత్ర ప్రదర్శన తెర సీజ్‌

మైలవరం, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న స్థానిక సంఘమిత్ర థియేటర్‌లోని ఒక తెరను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా బెనిఫిట్‌ షో ప్రదర్శించారంటూ అధికారులు చర్యలు చేపట్టారు. సంఘమిత్ర థియేటర్‌లో గల రెండు తెరల్లో అఖండ చిత్రాన్ని గురువారం విడుదల చేశారు. అభిమానుల కోరిక మేరకు ఉదయం 8.30 గంటలకు బెనిఫిట్‌ షో నిర్వహించిన అనంతరం, ఉదయం ఆటను ప్రారంభించారు. ఆ సమయంలో డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీహరి, పోలీసులతో కలిసి థియేటర్‌కు వచ్చి బెనిఫిట్‌షోపై ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదును తెలిపి, ఆ షో నిర్వహించిన పెద్ద తెరను సీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం ఆట పూర్తయ్యాక, రెండో తెరలో మాత్రమే ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక తెరను సీజ్‌ చేశామని, తెరిచేందుకు ఆదేశాల వచ్చే వరకు మూసివేసి ఉంటుందని డీటీ శ్రీహరి పేర్కొన్నారు. దాంతో మధ్యాహ్నం ఆటకు వచ్చిన బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులు నిరాశ చెందారు. అభిమానుల కోరిక కాదనలేక బెనిఫిట్‌ షో వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారందరికీ వారి ఖాతాల్లోకే నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. ఒక తెర మూతపడడంతో మధ్యాహ్నం నుంచి రెండో తెరలోనైనా చూడాలని అభిమానులు ఎగబడ్డారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని