logo
Published : 03/12/2021 04:57 IST

బైపాస్‌ రహదారుల నిర్మాణ గడువు పెంపు

మచిలీపట్నం : విజయవాడ నగరానికి సంబంధించిన రెండు బైపాస్‌ రహదారి పనులు పూర్తిచేసేందుకు గడువు పొడిగించినట్టు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. రెండు పనుల పురోగతిపై గురువారం లోక్‌సభలో మంత్రి నితిన్‌గడ్కరీని ప్రశ్నించినట్టు ఎంపీ ఒక ప్రకటనలో తెలిపారు. చినఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ 30కి.మీ మేర ఆరు వరుసలతో నిర్మించాల్సిన రహదారి పనులు 23 శాతం వరకూ పూర్తయ్యాయని, కొవిడ్‌ నేపథ్యంలో పని పూర్తి చేసేందుకు గడువును 2023 ఫిబ్రవరి 17 వరకూ, గొల్లపూడి నుంచి చినకాకాని వరకూ 17.66 కి.మీ మేర ఆరు వరుసలుగా చేపట్టిన రహదారి పనులు 3.36 శాతం పూర్తయ్యాయని మొత్తం పని ముగించేందుకు గడువు 2024 జనవరి 4 వరకూ పొడిగించినట్టు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారని ఆయన పేర్కొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని