logo
Published : 03/12/2021 04:57 IST

వణికిస్తున్న వంకాయ..బెంబేలెత్తిస్తున్న బెండకాయ..

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌: కూరల్లో రారాజు వంకాయను కొనలేకపోతున్నాం. మృధువైన లేత బెండ.. రాతి బండగా మారింది. రైతు బజార్లలో టమాటా ధరలు తగ్గుతున్నాయని అనుకుంటే.. బెండ, వంకాయ తదితర కూరగాయల ధరలు అమాంతం పెరిగి, వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు కిలో రూ.48లు ఉన్న బెండ ధర, గురువారం ఒక్కసారిగా రూ.60లకు పెరిగింది. వంకాయలు రూ.48ల నుంచి రూ.56లకు పెరిగాయి. టమాటాలు రూ.55ల నుంచి రూ.53లకు తగ్గాయి. దొండ రూ.50ల నుంచి రూ.54లకు, బీర రూ.46ల నుంచి రూ.50లకు పెరిగింది. ఇలా పలు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు విలవిలాడుతున్నారు. రైతు బజార్లలలోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక బహిరంగ మార్కెట్లలో ఇంకా అధికంగా ఉన్నాయంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెండ, దొండ కాయలు చినఓగిరాల, పెదఓగిరాల నుంచి నగరానికి వస్తుంటాయి. బీర గుంటూరు జిల్లా మోరంపూడి తదితర ప్రాంతాల నుంచి వస్తుంది. సరకు తక్కువగా రావడమే ధరలు పెరుగుదలకు కారణమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని