logo
Published : 03/12/2021 04:57 IST

మాదక ద్రవ్యాలను నిరోధించండి : ఎస్పీ


సూచనలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాల నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఎస్‌ఈబీ) సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం ఆయన ఎస్‌ఈబీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం సేకరించే దిశగా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. నేరాలకు పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకుంటామనే విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. ఇప్పటి వరకూ చేపట్టిన దాడులు, ఇతర అంశాలను సమీక్షించారు.

ఫిర్యాదుల స్వీకరణ
రోజూ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. తన పొలాన్ని సరిహద్దుదారుడు ఆక్రమించాలనే ప్రయత్నాలో భాగంగా తనను తీవ్రంగా బెదిరిస్తున్నాడని పెడనకు చెందిన వ్యక్తి, తన కుమార్తెకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేయగా అత్తింటి వారు అధికకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తగు న్యాయం చేయాలని గుడివాడకు చెందిన ఓ వ్యక్తి కోరారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఇతరు ఇచ్చిన ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని