logo
Published : 03/12/2021 04:57 IST

పుట్టినరోజే విషాదగీతిక

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - గన్నవరం గ్రామీణం: పుట్టిన రోజు నాడు తన స్నేహితురాలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపాడు ఆ యువకుడు. స్నేహితురాలిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో యువకుడు మృత్యువాత పడగా, స్నేహితురాలు తీవ్ర గాయాలపాలైంది. గన్నవరం మండలం చినఆవుటపల్లి వద్ద గురువారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో యువతి పరిస్థితి విషమంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన సేవ చంద్రకాంత్‌ (25) విజయవాడలో ఓ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. అక్కడే నెల్లూరుకు చెందిన షేక్‌ షమీనా అనే యువతి పరిచయమైంది. ఇటీవల జ్వరం రావడంతో చంద్రకాంత్‌ తన స్వస్థలం వెళ్లిపోయాడు. గురువారం అతని పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు షమీనా.. జంగారెడ్డిగూడెం వెళ్లింది. వేడుకలు ముగిసిన అనంతరం షమీనాను విజయవాడలో దింపేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో స్థానిక పిన్నమనేని ఆసుపత్రికి చేరే సరికి.. చీకట్లో రోడ్డుదాటుతున్న దారా వెంకటరత్నం (47) అనే వ్యక్తిని వాహనం ఢీకొంది. ప్రమాదంలో చంద్రకాంత్‌తో పాటు వెంకటరత్నం ఎగిరి వెళ్లి.. విజయవాడ నుంచి ఏలూరు వైపునకు వెళ్లే మార్గంలో పడ్డారు. వెనుక నుంచి అతివేగంగా వస్తున్న మరోలారీ ఇరువురిని ఢీకొంది. ప్రమాదంలో చంద్రకాంత్‌తో పాటు వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు. షమీనా తీవ్ర గాయాలపాలైందని ఆత్కూరు ఎస్సై కిశోర్‌ తెలిపారు.

నెత్తురోడుతున్న జాతీయ రహదారి
గన్నవరం పరిధిలోని చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని గూడవల్లి - తేలప్రోలు మధ్య ప్రమాదాలు అధికంగా నమోదు కావడం స్థానికులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత రెండు నెలల వ్యవధిలో సుమారు పదకొండు మంది చినపోగా, 50 మంది వరకు క్షతగాత్రులయ్యారు. స్థానిక పిన్నమనేని సిద్ధార్థ కళాశాల వద్ద జాతీయ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాంతం ప్రమాదాలకు నెలవుగా మారింది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని