Fast Food: ఫాస్ట్‌ఫుడ్‌తో హర్మోన్లలోనూ సమస్యే!

పిజ్జా, బర్గర్‌ అంటూ ఫాస్ట్‌ఫుడ్‌ను చాలా మంది లొట్టలేసుకొని తింటుంటారు. ఇలాంటి ఆహారం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశం ఉందని అందరికీ తెలుసు. అయినా.. తినడం మానేయట్లేదు. అయితే, వీటిని తినడం వల్ల ఊబకాయమే కాదు.. హార్మోన్లలోనూ సమస్యలు

Published : 30 Oct 2021 01:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిజ్జా, బర్గర్‌ అంటూ ఫాస్ట్‌ఫుడ్‌ను చాలా మంది లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఇలాంటి ఆహారం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశం ఉందని అందరికీ తెలుసు. అయినా.. తినడం మానేయట్లేదు. అయితే, వీటిని తినడం వల్ల ఊబకాయమే కాదు.. హార్మోన్లలోనూ సమస్యలు తలెత్తుతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 64 రకాల ఫాస్ట్‌ఫుడ్‌ నమూనాలను తీసుకొని పరీక్షించగా.. వాటిలో 10 నుంచి 11 రకాల ప్రమాదకర ప్లాస్టిక్‌-సాఫ్టెనింగ్‌ రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా థాలెట్స్‌ రసాయనం హార్మోన్ల వ్యవస్థను దెబ్బతిస్తుందని వెల్లడించారు. అలాగే వంధ్యత్వం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు.

ఫాస్ట్‌ఫుడ్‌ ప్యాకింగ్‌ సులువుగా అవడానికి తయారీదారులు గ్లోవ్స్‌, కన్వేయర్‌ బెల్ట్స్‌, ప్యాకింగ్‌, ర్యాపింగ్‌, ట్యూబ్స్‌లో థాలెట్స్‌, ప్లాస్టిసైజర్‌ వంటివాటిని ఉపయోగిస్తుంటారు. దీంతో ఆ రసాయనాలు తినుబండారాల్లోనూ కలుస్తాయి. పరిశోధకులు పరీక్షించిన నామూనాల్లో 70 నుంచి 86శాతం పదార్థాల్లో థాలెట్స్‌, ప్లాస్టిసైజర్లు ఉన్నాయట. కేవలం ఫాస్ట్‌పుడ్‌ మాత్రమే కాదు.. రెస్టారెంట్లు, స్టాళ్లలో ఉండే ఆహార పదార్థాల్లోనూ వాతావరణంలోని వివిధ రసాయనాలు కలిసే అవకాశముందని చెబుతున్నారు. కాబట్టి.. బయట ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని