Corona Vaccine: అపోలో ఆసుపత్రుల్లో త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు!

త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందించనున్నట్లు అపోలో గ్రూపు ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి

Published : 26 Oct 2021 07:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందించనున్నట్లు అపోలో గ్రూపు ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తొలుత సహరుగ్మతలు(కోమార్బిడిటీస్‌)తో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తామన్నారు. ఆమోదం రావాల్సి ఉందన్నారు. ‘2-18 సంవత్సరాల వయసుల వారికి కొవాగ్జిన్‌ టీకా సిద్ధమైంది. 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదుల్లో ఇవ్వాలి. ఇంట్రా-మస్కులరీ విధానంలో వేస్తారు. 12-18 సంవత్సరాల వయసు వారికి జైకోవ్‌-డి టీకా 28 రోజుల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వాలి. ఇది సూది రహిత వ్యాక్సిన్‌’ అని పేర్కొన్నారు. టీకాలతోనే పిల్లలకు పూర్తి రక్షణ అన్నారు. వయస్సు-సమూహ వివరాలు అందిన తరువాత కార్యక్రమం ప్రారంభించనున్నామని చెప్పారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని