Marriage: నుదుట బొట్టును తుడిపించి.. ఆరు గంటల్లోనే పెటాకులైన ప్రేమ పెళ్లి

అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఓ కుర్రాడిని గమనించిన ఇంటి యజమాని దొంగా దొంగా అంటూ గట్టిగా అరిచాడు. దీంతో కుర్రాడు బయటకు పరుగులు తీశాడు. యజమాని అరుపులు విన్న గ్రామస్థులు యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చాడేమోనని

Updated : 25 Aug 2021 01:46 IST

రాంచీ: అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఓ కుర్రాడిని గమనించిన ఇంటి యజమాని దొంగా దొంగా అంటూ గట్టిగా అరిచాడు. దీంతో కుర్రాడు బయటకు పరుగులు తీశాడు. యజమాని అరుపులు విన్న గ్రామస్థులు యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చాడేమోనని చితకబాదబోయారు. ఇంతలోనే ఆ కుర్రాడు అసలు విషయం చెప్పాడు. తాను దొంగతనానికి రాలేదని.. ఆ ఇంట్లో ఉండే తన ప్రేయసిని కలిసేందుకు వచ్చానని తెలిపాడు. ఇది విన్న వారంతా ఆ అమ్మాయిని పిలిపించి నిజమా? కాదా అని అడిగారు. అతడు తన ప్రియుడేనని ఆ యువతి బదులిచ్చింది.

దీంతో గ్రామస్థులంతా కలిసి వారిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అబ్బాయి తండ్రికి ఫోన్​ చేసి పిలిపించారు. అప్పటికప్పుడు ఊరి మధ్యలో అందరి సమక్షంలో వివాహం జరిపించారు. వారి సంప్రదాయం ప్రకారం అబ్బాయి.. అమ్మాయి నుదుటన బొట్టు పెడితే వివాహం జరిగినట్లే. అలా పెళ్లి తంతు ముగిసింది. అయితే  ఈ విషయం  తెలుసుకున్న పోలీసులు ఇరు కుటంబాలను పోలీస్​స్టేషన్​కు పిలిపించి ఆరా తీశారు. విచారణలో అమ్మాయికి 19 ఏళ్లు, అబ్బాయికి 16 ఏళ్లే అని తెలిసింది. బాలుడిని పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం చెల్లదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో గ్రామపెద్దలు పెళ్లి రద్దు చేయించారు. అమ్మాయి నుదిటికి పెట్టిన బొట్టును అబ్బాయితోనే తుడిపించారు.

ఝార్ఖండ్​లోని గఢ్​వా పట్టణానికి సమీపంలో ఉన్న మఝిగవా​ గ్రామంలో శనివారం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం వారికి వివాహం జరిపించగా.. మధ్యాహ్నం వారిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం వివాహం రద్దయ్యింది. పెళ్లి జరిగిన 6 గంటల్లోనే ఆ వివాహం రద్దవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు