Karnataka: కవలలకు కేరాఫ్‌గా శారద గణపతి విద్యా కేంద్రం

కవల పిల్లలను చూస్తేనే ముచ్చట పడిపోతుంటాం. పాఠశాలల్లోనూ కవలలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అలాంటిది ఓ పాఠశాల కవల విద్యార్థులకు

Published : 02 Dec 2021 23:55 IST

మంగళూరు: కవల పిల్లలను చూస్తేనే ముచ్చట పడిపోతుంటాం. పాఠశాలల్లోనూ కవలలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అలాంటిది ఓ పాఠశాల కవల విద్యార్థులకు కేరాఫ్‌గా నిలిచింది. కర్ణాటకలోని మంగళూరు శివారులో కైరంగల పుణ్యకోటినగరలో ఉన్న శారద గణపతి విద్యా కేంద్రం కవల పిల్లల పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు తెచ్చకుంది. ఆ పాఠశాలలో తొలిసారిగా 2008లో కవలలు చేరారు. ప్రస్తుతం అక్కడ 11 కవల జంటలున్నాయి. ఇంతమంది కవలలను చూసి ఉపాధ్యాయులు సహా విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 3 కవల జంటలు ఉన్నాయి. 5వ తరగతిలో రెండు, 6,7,8,10 తరగతుల్లో ఒక్కో జంట ఉన్నాయి. 12వ తరగతిలో రెండు కవల జంటలు ఉన్నాయి. గతంలో ఇద్దరు ముగ్గురు కవలలు ఉన్నప్పుడు సాధారణంగానే భావించినట్టు పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీహరి చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న కవలల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. పాఠశాల పేరులోనూ.. జంట పేర్లు ఉండటాన్ని స్థానికులు విశేషంగా భావిస్తున్నారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని