Video: అసలే వరద.. ఆపై గొర్రెల మంద.. ఇంకేముందీ?

ఒక గొర్రె బావిలో పడితే మిగతావీ పడతాయన్నది సామెత. సరిగ్గా అలాంటి ఘటనే నాగర్‌కర్నూలు జిల్లా-నల్గొండ జిల్లా సరిహద్దుల్లో........

Published : 12 Oct 2021 01:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒక గొర్రె బావిలో పడితే మిగతావీ పడతాయన్నది సామెత. సరిగ్గా అలాంటి ఘటనే నాగర్‌కర్నూలు జిల్లా-నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగింది. అసలే వరద.. ఆపై గొర్రెల మంద.. ఇంకేముందీ? అన్నీ కలిసి వరదలో పడిపోయాయి. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వద్ద డిండి వాగు దాటిస్తుండగా ఈ ఘటన జరిగింది. వరద ఉద్ధృతికి గొర్రెలు కొట్టుకుపోయాయి. ఎదురీదేందుకు మూగ జీవాలు ప్రయత్నిస్తుండగా.. స్థానికులు ఒడ్డుకు లాగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని