AP NEWS: విశాఖలో రోడ్డెక్కిన శాక్రెడ్‌ హార్ట్‌ పాఠశాల విద్యార్థినులు, తల్లిదండ్రులు

విశాఖలో శాక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాల మూసివేతపై విద్యార్థులు, తల్ల్లిదండ్రులు రోడ్డెక్కారు.

Updated : 25 Oct 2021 13:00 IST

విశాఖ: విశాఖలో శాక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాల మూసివేతపై విద్యార్థులు, తల్ల్లిదండ్రులు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేపట్టి.. జ్ఞానాపురం రోడ్డును దిగ్బంధించారు. తమకు నవరత్నాలు వద్దని చదువుకోనిస్తే చాలని విద్యార్థులు నినాదాలు చేశారు. అర్ధాంతరంగా పాఠశాలను మూసేస్తే తమ పిల్లల భవిష్యత్ ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

విద్యాసంవత్సరం మధ్యలో ఉండగానే పాఠశాలను మూసివేయడం దారుణమని వాపోయారు. దాదాపు 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో జ్ఞానాపురం, కంచరపాలెం, అల్లిపురం, రైల్వే న్యూకాలని, కొబ్బరితోట, పూర్ణామార్కెట్ ప్రాంతాలకు చెందిన వందల మంది పేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని