Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 25 Jan 2022 16:58 IST

1. మునిగినా.. తేలినా సరే అనుకునే సమ్మెలోకి..: వెంకట్రామిరెడ్డి

ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నట్లు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇప్పుడు పోరాడకపోతే భవిష్యత్తులో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన  పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మన ఈసీ ఇతర దేశాలకు బెంచ్ మార్క్‌ నిర్దేశించింది: మోదీ

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరును అభినందించారు. వ్యక్తులకు నోటీసులు జారీచేయగల, అధికారులను బదిలీ చేయగల ఎన్నికల సంఘాలు ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ప్రశంసించారు. దీని పనితీరు, ఎన్నికల ప్రక్రియ పలు దేశాలకు ప్రమాణాలను నిర్దేశించిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు: ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌ జిల్లాలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వాహనంపై తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. నందిపేట్‌ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీ అర్వింద్‌ చెప్పారు.  సుమారు 200 మంది ఆ పార్టీ కార్యకర్తలు తమకు అడ్డు తగిలారని.. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వేశారని ఆరోపించారు. ఈ విషయంపై సీపీ, ఏసీపీలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. పోలీసులే దగ్గరుండి తమ వాహనాలపై దాడి చేయించారని అర్వింద్‌ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గుడివాడ వెళ్లనివ్వం.. భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు

4. పిరికివాళ్లు మాత్రమే అలా చేస్తారు: సుప్రియా శ్రీనతె

కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చారు. తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆర్‌పీఎన్‌ సింగ్‌ ప్రకటించడంపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయలో మండిపడుతోంది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతె మీడియాతో మాట్లాడుతూ.. పిరికివాళ్లు మాత్రమే పూర్తిగా విభిన్నమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీల వైపు వెళ్తారంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హమ్మయ్య.. ఎట్టకేలకు లాభాలు!

సోమవారం భారీ నష్టాలతో మదుపర్లను బెంబేలెత్తించిన మార్కెట్లు ఈరోజు కాస్త చల్లబడ్డాయి. ఉదయం నుంచి ఊగిసలాట మధ్య చలించిన సూచీలకు ఎట్టకేలకు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు దొరికింది. దీంతో రెండు ప్రధాన సూచీలు చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ముంచుకొచ్చిన పెళ్లి ముహూర్తం.. మంచులోనే వరుడి ఊరేగింపు!

7. సీనియర్లను పక్కన పెట్టాలి.. : సంజయ్‌ మంజ్రేకర్‌

దక్షిణాఫ్రికా చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలు కావడాన్ని మాజీ క్రికెటర్‌ సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు. జట్టు ఎంపికలోనే లోపాలున్నాయని అభిప్రాయపడ్డాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న సీనియర్‌ ఆటగాళ్లను పక్కన పెట్టి.. యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బెంగాల్‌ గవర్నర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి భయానకంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా, నిర్భీతిగా వినియోగించుకొనే పరిస్థితుల్లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారంటూ మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. షావోమి కొత్త ఓఎస్‌... పది కొత్త ఫీచర్లు ఇవే!

షావోమి కొత్త ఓఎస్‌ వెర్షన్‌ MIUI 13 త్వరలో అందుబాటులోకి రానుంది. తొలుత ప్రీమియం శ్రేణి మొబైల్స్‌లో ఈ ఓఎస్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. షావోమి 12, షావోమి 12 ప్రో, షావోమి 12ఎక్స్‌, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 మొబైల్స్‌లో మొదట ఈ ఓఎస్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ వెర్షన్‌ ఓఎస్‌ జనవరి 26 తర్వాత మన దేశంలో మొబైల్స్‌కు విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రెండు రైళ్ల మధ్యలో గుర్రం పరుగులు చూశారా?

10. నోరుజారిన అమెరికా అధ్యక్షుడు.. రిపోర్టర్‌ను తిట్టిన బైడెన్‌..!

ఎప్పుడూ హుందాగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల ఓ విలేకరిపై నోరుపారేసుకొన్నారు. ఈ తతంగం జరిగే సమయంలో ఆయన మైక్‌ ఆన్‌లో ఉండటంతో అది అక్కడున్న వారందరికీ వినిపించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన జనవరి 24వ తేదీన శ్వేతసౌధంలో చోటు చేసుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని