Chennai Rains: అపస్మారక స్థితిలో వ్యక్తి.. భుజాలపై మోసి కాపాడిన మహిళా ఇన్‌స్పెక్టర్‌

తమిళనాడులోని చెన్నై నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రాత్రినుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూ పూర్తిగా జనజీవనం స్తంభించింది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వ, మునిస్పల్‌ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు.

Updated : 06 Dec 2023 14:56 IST

పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరిపై నెట్టింట ప్రశంసల వర్షం

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రాత్రినుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూ పూర్తిగా జనజీవనం స్తంభించింది. సహాయకార్యక్రమాల్లో ప్రభుత్వ, మునిస్పల్‌ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. బుధవారం ఉదయం చెన్నైలోని టీ పీ సత్రం ప్రాంతంలో మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి ఓ వ్యక్తిని కాపాడిన తీరు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనారోగ్యంతో శ్మశాన వాటికలో అపస్మారక స్థితిలో ఉన్న 28ఏళ్ల యువకుడిని తన భుజాలపై మోసి ఆసుపత్రికి తరలించారు. తొలుత కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. అక్కడ నుంచే ఎదురుగా వస్తున్న ఆటో దగ్గరకు తీసుకెళ్లి ఆటో ఎక్కించారు. విపత్తులో ఆమె ప్రదర్శించిన తెగువని చూసిన అందరూ ‘‘శెభాష్‌ రాజేశ్వరి’’ ‘‘ సెల్యూట్‌ మేడం’’ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక శనివారం నుంచి కురిసిన భారీ వర్షాలకు తమిళనాడులో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తమిళనాడు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కుమార్‌ జయంత్‌ తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని