Published : 25/07/2020 00:16 IST

వ్యాక్సిన్‌ వస్తోంది.. ప్రపంచమా ఊపిరిపీల్చుకో..!

అమెరికాలో ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ వెంకటేశ్‌తో ఇంటర్వ్యూ

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలన్నింటినీ కబళిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడ్డాయా? యావత్‌ ప్రపంచం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ లక్ష్యానికి చేరువయ్యామా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు పరిశోధకులు. త్వరలోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు.  బ్రిటన్, అమెరికా, రష్యా, చైనా సహా భారత్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలు ఇస్తున్నాయంటూ ఆయన ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. ప్రయోగాల్లో దుష్ప్రభావాలు ఏమీ లేకుండా ఎక్కువ మందిపై సానుకూల ఫలితాలతో పనిచేయడం శుభ పరిణామమన్నారు. డాక్టర్‌ వెంకటేష్‌ అమెరికా నుంచి ఈటీవీతో ముఖాముఖిలో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచమంతా ఉత్కంఠగా గమనిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కి సంబంధించిన ఎంతో విలువైన సమాచారం పంచుకున్నారు. అంతేకాదు చైనా ఇప్పటికే కరోనా టీకాను ఆమోదించిందని ఆయన తెలిపారు.

టీకాలు ఏ దశల్లో ఉన్నాయి?
ప్రపంచ వ్యాప్తంగా  160 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో నాలుగు మాత్రం చాలా అడ్వాన్స్‌గా ఉన్నాయి. ఇటీవల జూన్‌ 25న చైనాలో ఒక వ్యాక్సిన్‌ను చైనా ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని తొలి వ్యాక్సిన్‌ వచ్చేసిందనే చెప్పాలి. చైనా మిలటరీ వాళ్లకు ఇవ్వాలని అప్రూవ్‌ చేసినట్టు న్యూయార్క్‌టైమ్స్‌ ప్రచురించింది. మొత్తంగా చూస్తే.. కరోనాను అంతం చేసేందుకు 160 టీకాలు అభివృద్ధి చేస్తుండటం..అదీ పరస్పర సహకారంతో దేశాలు చేయడం గొప్ప విషయమంటున్నారు డాక్టర్‌ వెంకటేశ్‌.

ఆ టీకాల్లో కచ్చితత్వం ఎంత?
కొద్ది రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ అన్నీ విజయవంతంగా పూర్తయినట్టు రష్యా సంచలన ప్రకటన చేసింది. మరి చైనా అయితే, గుట్టుచప్పుడు కాకుండా ఆ దేశ తొలి టీకాకు ఆమోదం తెలిపింది. వాటిలో కచ్చితత్వం ఎంత? ప్రపంచంలో ఎక్కడ టీకా వచ్చినా అది అన్ని దేశాలకు చేరడానికి ఎంతసమయం పట్టొచ్చు? వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో తొలుత కాస్త వెనకబడిన భారత్‌.. ఆ లోటును ఎలా భర్తీ చేసుకుంటుంది? తదితర అనేక కీలక ప్రశ్నలకు డాక్టర్‌ వెంకటేశ్‌ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో చూడండి.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని