భారతరత్న CNR రావుకు ఇంటర్నేషనల్‌ అవార్డు

భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావును అంతర్జాతీయ పురస్కారం వరించింది. రసాయన శాస్త్రంలో లెజెండరీ సైంటిస్ట్‌గా ఉన్న ఆయనక....

Updated : 27 May 2021 20:57 IST

దిల్లీ: భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావును అంతర్జాతీయ పురస్కారం వరించింది. రసాయన శాస్త్రంలో లెజెండరీ సైంటిస్ట్‌గా ఉన్న ఆయనకు పునరుత్పాదక ఇంధన వనరులపై చేసిన పరిశోధనలకు గాను ఇంటర్నేషనల్‌ ఎనీ అవార్డు- 2020 దక్కింది. ఎనర్జీ రీసెర్చిలో ఈ పురస్కారాన్ని నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. ఈ పురస్కారాన్ని ఆయనకు అక్టోబర్‌ 14న  రోమ్‌లోని క్విరినల్‌ ప్యాలస్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటారెల్లా హాజరు కానున్నారు. ఈ పురస్కారం కింద నగదు బహుమతితో పాటు బంగారు పతకాన్ని అందజేయనున్నారు. ఇంధన వనరుల వినియోగాన్ని మెరుగుపరచడం, వీటిపై పరిశోధనల్లో కొత్త తరాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక ఏళ్లుగా ఇస్తున్న ఈ పురస్కారం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని