Published : 20/09/2021 18:38 IST

Biden Slept: ఓపక్క మాట్లాడుతుంటే బైడెన్‌ నిద్రపోయారు..!

బెంజిమన్‌ నెతన్యాహూ ఆరోపణలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నిన్న నెతన్యాహూ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ కొత్త ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్‌ గతనెలలో జోబైడెన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో నెఫ్తాలీ బెన్నెట్‌ మాట్లాడుతుండగా జో బైడెన్‌ నిద్రలోకి జారుకొన్నట్లు ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ ఆంగ్ల వార్త సంస్థ ఆ వీడియోను ఫ్యాక్ట్‌ చెక్‌ చేసింది. అదొక ఫేక్‌వీడియోగా తేల్చింది. కొన్ని క్షణాల పాటు వీడియోను కట్‌చేసి ఎడిట్‌ చేసినట్లు పేర్కొంది.

తాజాగా నెతన్యాహూ అదే వీడియో అంశాన్ని మళ్లీ తన ఫేస్‌బుక్‌ పోస్టులో ప్రస్తావించారు. ఆ పోస్టులో ఒక స్వరం ‘‘మీకు తెలుసా.. బెన్నెట్‌ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కలిశారు’’ అని నెతన్యాహూను ప్రశ్నిస్తుంది. దీనికి నెతన్యాహూ స్పందిస్తూ ‘‘నేను కూడా విన్నాను. ఆ మీటింగ్‌లో బైడెన్‌ చాలా శ్రద్ధగా ఉన్నారు. బెన్నెట్‌ చెప్పేదానికి అంగీకారంగా ఆయన తలను వాల్చేశారు. అది ఎలా ఉందంటే నిద్రపోతున్నట్లు అనుకరిస్తున్నట్లు ఉంది’’ అని వెటకారంగా బదులిచ్చారు. లికూడ్‌ పార్టీకి చెందిన నెతన్యాహూకు అమెరికాలోని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌తో సత్సంబంధాలు ఉన్నాయి.

జూన్‌లో ఇజ్రాయెల్‌లో లెఫ్ట్‌, సెంట్రిస్ట్‌, రైట్‌ వింగ్‌ పార్టీలతోపాటు అరబ్‌ పార్టీలు కూడా కలిసి సమష్టిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీనికి నెఫ్తాలీ బెన్నెట్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్లపాటు కొనసాగిన బెంజిమన్‌ నెతన్యాహూ పాలన అంతమైంది. దీంతో అయన వర్గం ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో కూర్చొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని