ప్రయాణాల్లో మాస్క్‌ లేకుంటే ఇక చర్యలే

కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికి పోతున్నప్పటికీ.. మాస్క్ ధరించే విషయంలో మాత్రం ఇప్పటివరకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వలేకపోయింది. మాస్క్ ధరించడంపై ట్రంప్‌నకు ఉన్న అనాసక్తే ఇందుకు ఓ కారణం కావచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడ.

Updated : 02 Feb 2021 23:23 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికి పోతున్నప్పటికీ.. మాస్క్ ధరించే విషయంలో మాత్రం ఇప్పటివరకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వలేకపోయింది. మాస్క్ ధరించడంపై ట్రంప్‌నకు ఉన్న అనాసక్తే ఇందుకు ఓ కారణం కావచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్తగా బైడెన్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం మాత్రం.. ఎన్నికల ముందు కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపడతామని నొక్కి చెప్పింది. అన్నట్లుగానే చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రయాణ ప్రాంతాలు, ప్రజారవాణా, ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ముఖం, ముక్కు మూసి ఉండేలా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీచేసింది. లేకుంటే చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.

‘తాజా ఆదేశాల ప్రకారం, విమానాలు, రైళ్లు, షిప్లు, బస్సులు, సబ్వేలలో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే. ఉబర్ వంటి ప్రైవేట్ టాక్సీల్లోనూ ఈ నిబంధనలు పాటించాల్సిందే. భోజనం చేసేటప్పుడు, నీరు తాగే సందర్భాలలో మాత్రమే వీటికి మినహాయింపు ఇవ్వనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా, శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది’ అని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు ధరించి ప్రయాణాలు చేవడం వల్ల సాధ్యమైనంత వరకు కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని సీడీసీ వెల్లడించింది. 

మాస్కులు ధరించే విషయమై ఇప్పటికీ సీడీసీ అక్కడి ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేస్తూనే ఉంది. కానీ, దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు మాత్రం ట్రంప్ ప్రభుత్వం వెనకడుగు వేయడంతో అవి అమల్లోకి రాలేదు. కానీ, కొత్తగా అధికారంలోకి వచ్చిన బైడెన్ తొలిరోజు నుంచే కరోనా కట్టడి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీడీసీ తాజాగా ప్రయాణాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ఇదీ చదవండి

మహాత్మా మన్నించు.. శ్వేత సౌధం ప్రకటన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని