Covid: కొవిడ్‌ సోకినా ప్రమాణ స్వీకారానికి హాజరై..!

కొవిడ్‌ సోకితే మనం ఏమి చేస్తాం.. సెల్ఫ్‌ఐసోలేషన్‌లో ఉంటాము.. కానీ, చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు మిలోస్‌ జెమన్‌  మాత్రం ఏకంగా ఓ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకోసం ఏకంగా అక్కడ ఒక కృత్రిమ గాజుగదిని ఏర్పాటు చేయించుకొన్నారు.

Published : 29 Nov 2021 14:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ సోకితే మనమేం చేస్తాం.. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటాం.. కానీ, చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు మిలోస్‌ జెమన్‌  మాత్రం ఏకంగా ఓ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకోసం ప్రత్యేకంగా అక్కడ ఒక కృత్రిమ గాజుగదిని ఏర్పాటు చేయించుకొన్నారు. ఆదివారం చెక్‌ రిపబ్లిక్‌ దేశంలో సెంటర్‌-రైట్‌ అలయన్స్‌ నాయకుడు పీటర్‌ ఫియాల ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో సెంటర్‌, సెంటర్‌ రైట్‌ ప్రతిపక్షాలు సమష్టిగా విజయం సాధించాయి. దీనికి పీటర్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చెక్‌ రిపబ్లిక్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో అధ్యక్షుడు  ఆరు వారాల క్రితం గుర్తుతెలియని ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆయనకు కొవిడ్‌ సోకింది.

తాజాగా ప్రధానమంత్రి నియామక కార్యక్రమానికి అధ్యక్షుడు జెమన్‌ ఆదివారం హాజరయ్యారు. పూర్తిగా పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది ఆయన్ను వీల్‌ఛైర్‌పై తీసుకొచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న గదిలో ఒక ప్రత్యేకమైన గాజుగదిని ఏర్పాటు చేశారు. దీని నుంచే అధ్యక్షుడు జెమన్‌.. ప్రధాని చేత ప్రమాణం చేయించారు.

మరోపక్క చెక్‌ రిపబ్లిక్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే ఇక్కడ వ్యాక్సినేషన్‌ కూడా తక్కువగానే జరిగింది. ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆ దేశంలో తీవ్రమైన విద్యుత్తు సంక్షోభం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని