Diabetes: 40 ఏళ్లు దాటిన మధుమేహులకు కొవిడ్‌ ఇబ్బందికరమే

నలభై ఏళ్లు పైబడి, టైప్‌-1 మధుమేహం ఉన్నవారు కొవిడ్‌-19 బారినపడితే..

Updated : 26 Sep 2021 11:12 IST

హ్యూస్టన్‌: నలభై ఏళ్లు పైబడి, టైప్‌-1 మధుమేహం ఉన్నవారు కొవిడ్‌-19 బారినపడితే.. వారికి తీవ్ర అనారోగ్యం ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. పిల్లలు, యువతతో పోలిస్తే వీరు ఆసుపత్రిపాలు కావడానికి 7 రెట్లు ఎక్కువ అవకాశం ఉంటుందని తెలిపింది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌ బారినపడ్డ పిల్లలు చాలా అరుదుగానే శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటారని, వారిలో చాలావరకూ వ్యాధి లక్షణాలు కనిపించవని పరిశోధకులు తెలిపారు. దీనికి భిన్నంగా వయోజనుల్లో శ్వాస సంబంధ రుగ్మతలు కనిపిస్తుంటాయన్నారు. వీరిలో 40 ఏళ్లు పైబడి, టైప్‌-1 మధుమేహం బారినపడ్డవారికి ‘ఆక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌’తోపాటు మరణం ముప్పు ఎక్కువని తెలిపారు. వీరిలో డయాబెటిక్‌ కీటోయాసిడోసిస్‌ లేదా తీవ్రస్థాయి హైపర్‌గ్లైసీమియా కూడా తలెత్తవచ్చని పేర్కొన్నారు. ఇలాంటివారిలో ఊబకాయం, అధికరక్తపోటు లేదా హృద్రోగం, మూత్రపిండాల వ్యాధి సమస్యలూ ఎక్కువేనని వివరించారు. దీన్నిబట్టి ఇలాంటివారికి ప్రత్యేక కొవిడ్‌ చికిత్సలు, టీకాలు అవసరమని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని