Corona virus: మధ్యప్రదేశ్‌లో ఏవై.4 కలకలం!

దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుతున్న క్రమంలోనే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 అనే కొత్త వేరియంట్‌ సోకింది! వీరంతా రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకున్నవారే కావడం కొంత ఆందోళన కలిగిస్తోంది.

Published : 26 Oct 2021 06:57 IST

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ఆరుగురికి వైరస్‌

ఇండోర్‌, దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుతున్న క్రమంలోనే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 అనే కొత్త వేరియంట్‌ సోకింది! వీరంతా రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకున్నవారే కావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్‌ సోకిన విషయాన్ని దిల్లీలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం కూడా ధ్రువీకరించింది. వైరస్‌ జన్యుక్రమాన్ని తెలుసుకునేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపినట్టు మధ్యప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ ప్రధానాధికారి బి.ఎస్‌.సాయిత్య సోమవారం వెల్లడించారు. చికిత్స అనంతరం బాధితులంతా కోలుకున్నారని చెప్పారు. మరోవైపు, దేశంలో సోమవారం ఉదయం నాటికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,306 మంది కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించి మరో 443 మంది ప్రాణాలు విడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని