ఆమె గుండె కుడివైపున ఉంది!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌ అని ఓ సినీ కవి అన్నారు. అయితే, ఓ యువతికి మాత్రం ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉందట. పుట్టిన 19ఏళ్ల తర్వాత ఈ విషయం తెలియడంతో ఆమె షాక్‌ నుంచి తేరుకోవట్లేదు. అమెరికాలోని చికాగోకి చెందిన క్లెయిర్‌ మాక్‌ గత రెండు నెలల నుంచి దగ్గుతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని మందులు వేసుకున్నా 

Published : 22 Jul 2021 01:19 IST


(Photo: insta/clairemack04 )

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌ అని ఓ సినీ కవి అన్నారు. అయితే, ఓ యువతికి మాత్రం ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉందట. పుట్టిన 19ఏళ్ల తర్వాత ఈ విషయం తెలియడంతో ఆమె షాక్‌ నుంచి తేరుకోవట్లేదు. అమెరికాలోని చికాగోకి చెందిన క్లెయిర్‌ మాక్‌ గత రెండు నెలల నుంచి దగ్గుతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గకపోవడంతో గత నెలలో ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్లు గుర్తించాడు. అయితే, చికిత్సలో భాగంగా ముందుగా ఎక్స్‌ రే తీయాలని నిర్ణయించారు. అలా తీసిన ఎక్స్‌ రేతో గుండె కుడివైపు ఉన్న విషయం బయటపడింది. ఇదే విషయాన్ని క్లెయిర్‌కు చెప్పడం ఆమె విస్మయానికి గురైంది. ఇలా గుండె ఎడమవైపునకు కాకుండా కుడివైపు ఉంటే డెక్స్‌ట్రాకార్డియా అంటారని, ప్రపంచ జనాభాలో ఒకశాతం కంటే తక్కువ మందిలో ఇలా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని క్లెయిర్‌ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లలో కొందరు ఆమెపై జోకులు వేస్తుంటే.. మరికొందరు జాగ్రత్తగా ఉండండని సూచనలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని