Taiwan: తైవాన్‌ జాతీయులను బంధించి.. చైనాకు తరలించి..!

దాదాపు 600 మంది తైవాన్‌ జాతీయులను వివిధ దేశాల్లో బంధించి చైనాకు తరలించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Published : 01 Dec 2021 22:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు 600 మంది తైవాన్‌ జాతీయులను వివిధ దేశాల్లో బంధించి చైనాకు తరలించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్పెయిన్‌కు చెందిన సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ అనే సంస్థ బయటపెట్టింది. తైవాన్‌ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయంగా దెబ్బతీయడమే ఈ చర్యల లక్ష్యమని పేర్కొంది. తైవాన్‌ జాతీయులను అరెస్టు చేస్తే వారిని తిరిగి తైవాన్‌కే పంపాలని తైవాన్‌ కోరుతోంది.

2016-19 మధ్యలో బందీల అప్పగింతలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ నివేదిక తయారు చేసినట్లు సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ పేర్కొంది. పరపతిని వాడుకొంటూ చైనా విదేశాల్లోని తైవాన్‌ జాతీయులను వేటాడుతోందని వెల్లడించింది. చైనాకు బలవంతంగా తరలించినవారికి అక్కడ బంధువులుగానీ, మరెవరుగానీ లేరని పేర్కొంది. తీవ్రమైన విచారణను ఎదుర్కోవడం, మానవహక్కుల ఉల్లంఘన వంటి సమస్యలను ఎదుర్కోవచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది. చాలా దేశాలు అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ బీజింగ్‌తో ఒప్పందాలు చేసుకొన్నాయని ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని