Published : 02/11/2021 02:04 IST

Karnataka: ముంబయి-కర్ణాటక కాదు..కిట్టూర్‌-కర్ణాటక..

బెంగళూరు: కర్ణాటకలోని ముంబయి-కర్ణాటక ప్రాంతం పేరును కిట్టూర్‌-కర్ణాటకగా మారుస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై పేరు మార్పు గురించి ప్రకటన చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వివాదాలు తరచూ తలెత్తుతున్న నేపథ్యంలో వాటికి పాత పేర్లనే కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతాన్ని కల్యాణ-కర్ణాటకగా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ముంబయి-కర్ణాటక పేరును కిట్టూర్‌- కర్ణాటకగా మారుస్తున్నామన్నారు. త్వరలో జరగబోయే కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు సీఎం తెలిపారు. ‘‘కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరిహద్దు వివాదాలు తలెత్తాయి. ఆ వివాదాలు పరిష్కారమైనా.. పేర్ల వల్ల తరచూ ఈ అంశం చర్చలకు దారితీస్తోంది. అసలు ఉత్తర కర్ణాటకను ముంబయి-కర్ణాటక అని పిలవాల్సిన అవసరమేముంది? అందుకే పేరు మారుస్తున్నాం’’అని సీఎం బొమ్మై తెలిపారు. ప్రాంతీయ అసమానతలను అంతం చేసే దిశగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. కిట్టూర్‌-కర్ణాటక ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని