Night Curfew: కర్ణాటకలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత

కరోనాతో నెలకొన్న పరిస్థితులు మెరుగుపడటం, కొత్త కేసులు తగ్గుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రంలో......

Published : 05 Nov 2021 16:04 IST

బెంగళూరు: కరోనాతో నెలకొన్న పరిస్థితులు మెరుగుపడటం, కొత్త కేసులు తగ్గుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన రాత్రి పూట కర్ఫ్యూని ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూకి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల గడువు అక్టోబర్‌ 25తో ముగిసింది. దీంతో గత 10 రోజులుగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ఉందా? లేదా? అనే అంశంపై ప్రజల్లో అయోమయానికి తోడు అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు వాటికి తెరదించాయి. అలాగే, రాష్ట్రంలో గుర్రపు పందేలు పునఃప్రారంభించుకొనేందుకు కూడా పలు నిబంధనలతో కూడిన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. గుర్రపు పందేలు నిర్వహించే ప్రదేశాల్లో సామర్థ్యానికి మించి జనం హాజరు కారాదని, అలాగే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారినే అనుమతించాలని సూచించింది.

మరోవైపు, గురువారం కర్ణాటకలో 261 కొత్త కేసులు నమోదు కాగా.. ఐదుగురు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29,89,275కి చేరగా.. 38,095మంది మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 8267 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని