china: చైనాకు సవాల్‌.. బీఆర్‌ఐకీ పోటీగా ఐరోపా సమాఖ్య ప్లాన్‌..!

చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషేయేటీవ్‌కు పోటీగా ఐరోపా సమాఖ్య సరికొత్త పెట్టుబడుల ప్రణాళిక ప్రకటించనుంది.

Updated : 21 Dec 2022 17:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషేయేటీవ్‌కు పోటీగా ఐరోపా సమాఖ్య సరికొత్త పెట్టుబడుల ప్రణాళిక ప్రకటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ బీబీసీ పేర్కొంది. ఈ ప్రణాళికలో భాగంగా డిజిటల్‌, రవాణా, పర్యావరణ, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టనుంది. ఆఫ్రికా, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి పశ్చిమ దేశాల ప్రణాళికలో ఇదొక భాగంగా భావిస్తున్నారు. ‘గ్లోబల్‌ గేట్‌వే’ ఇనీషియేటీవ్‌గా భావించే ఈ ప్లాన్‌ను బుధవారం (ఐరోపా కాలమానం ప్రకారం) ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌ డెర్‌ లెయెన్‌ ప్రకటించనున్నారు. ఇప్పటికే పెట్టుబడికి అవసరమైన బిలియన్ల కొద్దీ యూరోలను సభ్యదేశాలు, ఆర్థిక సంస్థలు, ప్రైవేటు సంస్థల నుంచి సేకరించిన బిలియన్ల కొద్దీ యూరోలను ఎలా వెచ్చించాలనే దానిపై దృష్టిపెట్టింది. 

పెట్టుబడి ప్రణాళికను ఉర్సులా సెప్టెంబర్‌లోనే పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా దేశాలు, సరుకు రవాణ, సేవాలు, ప్రజలను కలిపేందుకు అవసరమైన నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మాకు నిధులు కావాలి’’ అని స్టేట్‌ యూనియన్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. నేడు ప్రకటించే ప్రణాళికలో చైనా అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు లేవు. 14పేజీల ఈ పత్రంలో చైనాకు పోటీ అన్నట్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని