Vaccine: టీకా వేసుకోకపోతే వేతనం ఇవ్వం: ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌

దేశంలో వ్యాక్సినేషన్‌ శరవేగంగా జరుగుతున్నా.. కొందరు మాత్రం వ్యాక్సిన్‌ వేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంటుందట. ఇలాంటి పరిస్థితే మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్‌

Published : 09 Nov 2021 17:49 IST

ముంబయి: దేశంలో వ్యాక్సినేషన్‌ శరవేగంగా జరుగుతున్నా.. కొందరు మాత్రం టీకా వేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంటుందట. ఇలాంటి పరిస్థితే మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌(టీఎంసీ)కు ఎదురైంది. దీనిపై దృష్టిపెట్టిన టీఎంసీ.. తాజాగా జరిగిన సమావేశంలో కీలక ప్రకటన చేసింది. టీఎంసీ పరిధిలోని ఉద్యోగులు ఎవరైనా వ్యాక్సిన్‌ వేసుకోకపోతే వారికి వేతనం నిలిపివేస్తామని వెల్లడించింది. వేతనం అందాలంటే.. కనీసం తొలి డోసు వ్యాక్సిన్‌ అయినా వేసుకోని ఉండాలని తెలిపింది.

అంతేకాదు.. తొలి డోసు తీసుకొని వ్యవధి పూర్తయినా.. రెండో డోసు వేసుకోని వారికి కూడా జీతాలు ఇవ్వబోమని టీఎంసీ అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన ఉద్యోగులు వ్యాక్సిన్‌ ధ్రువపత్రాలను తమ శాఖాధిపతులకు అందజేయాలని సూచించారు. అలాగే నగర పరిధిలో వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నేటి నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

కొన్ని నెలల కిందట ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజ్‌బాద్‌ జిల్లా అధికారి కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్‌ వేసుకోకపోతే వారి వేతనాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని