Corona virus: కరోనాతో రష్యా విలవిల.. ఆగని మరణాలు, కేసుల్లో కొత్త రికార్డు

కరోనా మహమ్మారి విజృంభణకు రష్యా గజగజ వణుకుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు పెరిగిపోతుండంతో......

Published : 18 Oct 2021 17:13 IST

మాస్కో: కరోనా మహమ్మారి విజృంభణకు రష్యా గజగజ వణుకుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు పెరిగిపోతుండం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న కొత్తగా 34,325 కేసులు రాగా.. ఈ వైరస్‌ ప్రభావంతో 998మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. మరోవైపు, ఆ దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 80లక్షల మార్కు దాటేసింది. ఇప్పటివరకు అక్కడ 80,27,012 పాజిటివ్‌ కేసులు, 2,24,310 మరణాలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. శనివారం నమోదైన మరణాలు (1002)తో పోలిస్తే కాస్త తగ్గినప్పటికీ కొత్త కేసులు మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా నమోదయ్యాయన్నారు.

టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతుండంతో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తుండటంతో అక్కడి అధికారులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. లాటరీలు, బోనస్‌లు, ఇతర ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నప్పటికీ వ్యాక్సిన్లపై సందేహాలు, తదితర కారణాలతో ప్రజలు ముందుకు రాకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ ఫలితాలనివ్వడంలేదు. మరోవైపు, ఇప్పటిదాకా 45మిలియన్ల మందికి పైగా ప్రజలు (మొత్తం జనాభాలో 33శాతం) అక్కడ పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు అధికారులు తెలిపారు. కరోనా మరణాలు, కేసులు పెరుగుతున్నా దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించడంలేదు. గతేడాది విధించిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోవడం, అధ్యక్షుడు పుతిన్‌ ర్యాంకింగ్‌ పడిపోవడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు వెనకాడుతుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని