Heavy Rain: తమిళనాడులో విషాదం..ఇల్లుకూలి నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వెల్లూరు జిల్లాలో ఇల్లు కూలి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. 

Updated : 19 Nov 2021 16:58 IST

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వెల్లూరు జిల్లాలో ఇల్లు కూలి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం రాజధాని నగరం చెన్నై కూడా భారీ వర్షాలతో జలమయమైంది. ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తెల్లవారుజామున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో వర్షపాతం క్రమంగా బలహీన పడుతోందని ప్రకటించింది. అయితే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని