Omicron: కొత్త వేరియంట్‌ వ్యాప్తి.. జపాన్‌ కీలక నిర్ణయం!

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో జపాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది....

Published : 29 Nov 2021 12:12 IST

టోక్యో: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో జపాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వచ్చే విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ దేశ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వెల్లడించారు. 

దక్షిణాఫ్రికా సహా మరో ఎనిమిది దేశాల నుంచి వచ్చే వారిపై గతవారం జపాన్‌ కొన్ని ఆంక్షలు విధించింది. వారంతా 10 రోజుల సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. దానికి కొనసాగింపుగా తాజాగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించింది.

తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్‌ జాడలు క్రమంగా ఇతర దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ల్లో ఈ వేరియంట్‌ బయటపడింది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ సహా పలు దేశాలు మాస్కులు వంటి నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అమెరికా, కెనడా, జపాన్‌, ఇరాన్‌, థాయిలాండ్‌, సింగపూర్‌తో పాటు ఐరోపా సమాఖ్య దేశాలు కూడా పలు దక్షిణాఫ్రికన్‌ దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని