Humanoid robot: ‘మీ ఫేషియల్‌ ఫీచర్స్‌ ఇస్తారా.. రూ. 1.5కోట్లు చెల్లిస్తాం’

తమ ఫేషియల్‌ ఫీచర్స్‌కు సంబంధించిన శాశ్వత హక్కులను ఎవరైనా ఇస్తే దాదాపు రూ.1.5 కోట్లు చెల్లిస్తామని ప్రోమోబోట్‌ అనే సంస్థ ప్రకటించింది.....

Published : 30 Nov 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హ్యూమనాయిడ్‌ రోబో అసిస్టెంట్‌లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోన్న అమెరికాకు చెందిన ఓ టెక్‌ సంస్థ.. వాటికి మరింత సహజమైన ముఖ స్వరూపం తీసుకొచ్చేందుకుగానూ ఓ ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైనా తమ ఫేషియల్‌ ఫీచర్స్‌కు సంబంధించిన శాశ్వత హక్కులను ఇస్తే దాదాపు రూ.1.5 కోట్లు చెల్లిస్తామని తెలిపింది. రోబోటిక్స్‌లో ఫేషియల్ రికగ్నిషన్, నావిగేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తదితర రంగాల్లో సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న ప్రోమోబోట్‌ సంస్థ.. చూడటానికి స్నేహపూర్వకంగా కనిపించే వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో సహాయకులుగా వ్యవహరించే రోబోలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.

వంద గంటల స్పీచ్‌ రికార్డింగ్‌

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసిన ఈ సంస్థ.. తుది ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎంపికైన వ్యక్తులకు సంబంధించి మొదటి దశలో.. ముఖం, శరీరానికి సంబంధించిన 3డీ ఆకృతులను తీసుకుంటారు. అనంతరం.. వారి గొంతుతో దాదాపు 100 గంటలపాటు స్పీచ్ మెటీరియల్‌ రికార్డ్‌ చేస్తారు. చివరగా.. సంబంధిత లైసెన్స్ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ రూపొందించిన ప్రోమోబోట్ వీ4 రోబోలు విశ్వవిద్యాలయాలు, విమానాశ్రయాలు తదితర చోట్ల సేవలందిస్తున్నాయి. గైడ్‌ మొదలు.. అడ్మినిస్ట్రేటర్‌, కన్సల్టెంట్‌ ఇలా అనేక విధులు నిర్వహిస్తాయి.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని