Updated : 09/11/2021 16:52 IST

US Reopens Borders: ఆంక్షలు లేని అమెరికా యానం.. ఆనందమే ఇక

వాషింగ్టన్‌ :  పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు అమెరికా బాట పట్టారు. ట్రంప్‌ హయాంలో విధించిన కొవిడ్‌ ఆంక్షలన్నింటినీ ఆ దేశం ఎత్తివేయడంతో ప్రయాణాలు ఊపందుకున్నాయి. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలో నెగెటివ్‌ ఫలితం వచ్చినట్టు ధ్రువీకరణ పత్రాలు చూపి పలువురు అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. వారికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. దీంతో మియామి, లాస్‌ ఏంజెలెస్‌, వాషింగ్టన్‌, అట్లాంటా, న్యూయార్క్‌, చికాగో, బోస్టన్‌ తదితర ప్రయాణ ప్రాంగణాల్లో సందడి నెలకొంది. సుదీర్ఘ విరామం తర్వాత తమ ఆత్మీయులను చూసి భావోద్వేగానికి గురవుతున్న దృశ్యాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. విదేశీ ప్రయాణికుల రాక విమానయాన సిబ్బందిలోనూ జోష్‌ నింపింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని