Published : 19/10/2021 02:10 IST

Melbourne: ప్రపంచంలోనే సుదీర్ఘ లాక్‌డౌన్‌కు తెర!

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్‌ కారణంగా లక్షల్లో మరణాలు సంభవించాయి. వైరస్‌ ధాటికి ఒకానొక సందర్భంలో ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం టీకాలు అందుబాటులోకి రావడం.. కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టడంతో దాదాపు అన్ని దేశాలు, నగరాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు. అనేక చోట్ల ఎత్తివేశారు. సుదీర్ఘ కాలంపాటు లాన్‌డౌన్‌లో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలోనూ ప్రభుత్వం తాజాగా నిబంధనలను ఎత్తివేసింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిస్థాయిలో తొలగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీంతో 9 నెలల (దాదాపు 262 రోజులు) సుదీర్ఘ లాక్‌డౌన్‌కు తెరపడింది. 50 లక్షల జనాభా కలిగిన మోల్‌బోర్న్‌లో గతేడాది మార్చి నుంచి ప్రభుత్వం ఆరుసార్లు లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక రోజులు లాక్‌డౌన్‌లో ఉన్న నగరంగా మెల్‌బోర్న్‌ నిలిచింది.

లాక్‌డౌన్‌పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కూడా లాక్‌డౌన్ ఎత్తివేతకు కారణంగా తెలుస్తోంది. ఈ సుదీర్ఘ లాక్‌డౌన్‌ను మెల్‌బోర్న్‌ ప్రజలు కొద్దిరోజులుగా వ్యతిరేకిస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ పలుమార్లు రోడ్లెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గత నెలలో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. పోలీసులపై పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. వారిపై రాళ్లు, సీసాలు రువ్వారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని