Cinema news: అనసూయ చిత్రానికి అనూప్‌ స్వరాలు

వ్యాఖ్యాతగా, నటిగా వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది అనసూయ.

Published : 17 Jan 2022 01:30 IST

హైదరాబాద్‌: వ్యాఖ్యాతగా, నటిగా వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది అనసూయ. జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ విభిన్న కథా చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యతను అనూప్‌ రూబెన్స్‌ తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఆర్వీ సినిమాస్‌ పతాకంపై ఆర్వీరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, సాయికుమార్, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వినసొంపైన పాటలతో శ్రోతలను అలరిస్తున్న అనూప్‌ రూబెన్స్‌ తమ చిత్రానికి పనిచేయడం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అనసూయ ఇందులో ఎయిర్‌హోస్టెస్‌ పాత్రలో కనిపించనుంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. త్వరలోనే టైటిల్‌, ఇతర వివరాలను వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని