Deepika Padukone: కరోనా బారిన పడినప్పుడు నా బుర్ర పనిచేయలేదు.. ఎందుకంటే..

గతేడాది కరోనా బారిన సినీ ప్రముఖుల్లో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ఒకరు. వ్యక్తిగత విషయాలను, మానసిక సమస్యలను బహిరంగంగా చెప్పే వ్యక్తుల్లో దీపిక ఒకరు. మరి కరోనాను ఎలా జయించింది? ఆ సమయంలో తన శారీర, మానసిక స్థితి ...

Published : 09 Jan 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది కరోనా బారిన సినీ ప్రముఖుల్లో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ఒకరు. వ్యక్తిగత విషయాలను, మానసిక సమస్యలను బహిరంగంగా చెప్పే వ్యక్తుల్లో దీపిక ఒకరు. మరి కరోనాను ఎలా జయించింది? ఆ సమయంలో తన శారీర, మానసిక స్థితి ఎలా ఉండేదనే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ‘‘ ఏప్రిల్‌ 2021లో నాతో పాటు మా నాన్న ప్రకాశ్‌ పదుకొణె, అమ్మ ఉజ్వల, చెల్లి అనిశా.. అందరికీ వైరస్‌ సోకింది. కరోనా తర్వాత జీవితం చాలా మారిపోయింది. శారీరకంగా నన్ను నేను గుర్తించలేనంతా మారిపోయా. నా ఆలోచనలేవి సరిగ్గా ఉండేవి కావు. కొవిడ్‌ విచిత్రంగా, మనసు శరీరానికి భిన్నంగా ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఆ సమయంలో శరీరం, మనసు వివిధ రకాలుగా స్పందిస్తాయి. శారీరకంగానూ నాలో ఎన్నో మార్పులు చూశా. కేవలం మందులతో నేను కోలుకోలేకపోయా. స్టైరాయిడ్స్‌ కూడా వాడాల్సివచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు బాగానే ఉన్నా అనుకున్నా కానీ నా మెదడు పని చేయలేదు. దీంతో రెండు నెలలు పనికి స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకున్నా. చాలా కష్టంగా అనిపించిన రోజులవి. మనసు, ఆలోచనలు కూడా నిలకడగా ఉండేవి కావు ’’ అని తెలిపింది. ప్రస్తుతం ప్రభాస్‌-నాగ్‌అశ్విన్‌ ‘ప్రాజెక్ట్‌-కె’తో పాటు శకున్ బత్రా దర్శకత్వంలో ‘గెహరియాన్’, అమితాబ్‌తో కలిసి ‘ది ఇంటర్న్’, షారుక్ ఖాన్‌తో కలిసి ‘పఠాన్’, హృతిక్ రోషన్ హీరోగా ‘ ఫైటర్’ వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని