Deepika Padukone: రొమాంటిక్‌ సీన్స్‌ చేయడం అంత ఈజీ కాదు: దీపికా పదుకొణె

సెట్‌లో అందరి ముందు కోస్టార్స్‌తో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదని నటి దీపికా పదుకొణె అన్నారు. వివాహం అనంతరం ఆమె నటించిన పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రం...

Updated : 21 Jan 2022 15:08 IST

ముంబయి: సెట్‌లో అందరి ముందు కోస్టార్స్‌తో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదని నటి దీపికా పదుకొణె అన్నారు. వివాహం అనంతరం ఆమె నటించిన పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రం ‘గెహ్రాహియా’. షకున్‌ భత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గెహ్రాహియా’ ట్రైలర్‌ను గురువారం సాయంత్రం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

మోడ్రన్‌ ఏజ్‌ లవ్‌స్టోరీగా సిద్ధమైన ఈ సినిమాలో దీపికా, సిద్ధాంత్‌ల మధ్య ముద్దు సన్నివేశాలతోపాటు కొన్ని రొమాంటిక్‌ సీన్లు కూడా ఉన్నాయి. దీంతో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడంపై దీపిక మాట్లాడుతూ.. ‘‘కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసమే కాకుండా కథ కోసమే సన్నివేశాలు క్రియేట్‌ చేశారనే దర్శకుడి దృష్టి కోణాన్ని గ్రహించినప్పుడు మాత్రమే రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించగలం. ఎందుకంటే సెట్‌లో అందరి ముందు కోస్టార్స్‌తో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు. దర్శకుడు షకున్‌ అన్ని విధాలుగా భద్రత కల్పించిన తర్వాతనే ముద్దు, రొమాంటిక్‌ సన్నివేశాలు చేయగలిగాను. ఇలాంటి కథను మనం ఇంతకు ముందు ఎన్నడూ వెండితెరపై చూడలేదు’’ అని దీపికా పదుకొణె చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనన్యాపాండే బంధువులుగా కనిపిస్తారు. అనన్యతో నిశ్చితార్థమైన వ్యక్తిగా సిద్ధాంత్‌ నటించారు. అయితే అనన్య వల్ల పరిచయమైన సిద్ధాంత్‌.. దీపిక ప్రేమలో పడడం.. ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్‌లో ఉండడం.. ఆ విషయం అనన్యకు తెలిసిపోవడం వంటి ఆసక్తికర, సున్నితమైన అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని