KL Rahul - Athiya: పెళ్లి పీటలెక్కనున్న కేఎల్‌ రాహుల్‌, అతియా..!

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నివాసం వరుస శుభకార్యాలకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. సునీల్‌ కుమార్తె అతియా, కుమారుడు అహాన్‌ ఇదే ఏడాదిలో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం....

Updated : 21 Jan 2022 17:32 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నివాసం వరుస శుభకార్యాలకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. సునీల్‌ కుమార్తె అతియా, కుమారుడు అహాన్‌ ఇదే ఏడాదిలో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీటౌన్‌లో ఇప్పుడు శెట్టి కుటుంబంలో వివాహ వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు. సునీల్ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ అతియాశెట్టి. హీరోయిన్‌గా సరైన సక్సెస్‌ని అందుకోలేకపోయిన ఈ భామ.. భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సుమారు మూడేళ్ల నుంచి డేటింగ్‌లో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట.

ఈ మేరకు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా.. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకారం తెలిపారట. దీంతో ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, అతియాశెట్టి సోదరుడు అహాన్‌ శెట్టి సైతం ‘తడప్‌’తో గతేడాది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అహాన్‌కు ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఆయన కూడా పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. తన ప్రేయసి తానియా ష్రాఫ్‌తో పెళ్లికి పెద్దల అంగీకారం కూడా తీసుకున్నాడట. దీంతో అతియా-రాహుల్‌, అహాన్‌-తానియా పెళ్లిళ్లు ఈ ఏడాదిలో జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని