Khiladi: ఖిలాడి’.. ఫుల్‌ కిక్‌

సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందిస్తానంటూ దూసుకొస్తున్నారు కథా నాయకుడు రవితేజ. ఇప్పుడాయనతో రమేష్‌ వర్మ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. అర్జున్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రంలోని నాలుగో పాటని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు....

Updated : 20 Jan 2022 07:14 IST

సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందిస్తానంటూ దూసుకొస్తున్నారు కథా నాయకుడు రవితేజ. ఇప్పుడాయనతో రమేష్‌ వర్మ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. అర్జున్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రంలోని నాలుగో పాటని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ‘‘ఫుల్‌ కిక్‌’’ అంటూ సాగే ఈ గీతాన్ని ఈనెల 26న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌, జీకే విష్ణు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని