God Father: ‘గాడ్‌ ఫాదర్‌’ ఆగయా.. లుక్‌తోనే అంచనాలు పెంచుతున్న చిరు

ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’.  మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా ‘లూసీఫర్‌’కు రీమేక్‌ అని తెలియగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఫస్ట్‌లుక్‌ వస్తుందా? అని అభిమానులంతా వేచి చూస్తున్నారు.

Updated : 04 Jul 2022 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). మలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసీఫర్‌’కు రీమేక్‌ అని తెలియగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఫస్ట్‌లుక్‌ వస్తుందా? అంటూ వేచి చూస్తున్న అభిమానులకు చిత్ర బృందం ఆ కానుకను అందించింది. సోషల్‌ మీడియా వేదికగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోపాటు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. నల్ల కళ్లద్దాలు ధరించి, జేబులో పెన్ను పెట్టుకుని చిరు పవర్‌ఫుల్‌గా కనిపించారు. ముఖ్యంగా ఆయన హెయిర్‌, వాకింగ్‌ స్టైల్‌ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. చిరు నడకకు తగ్గట్టు తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఉర్రూతలూగించేలా ఉంది.

చిరంజీవి హీరోగా నటిస్తున్న 153వ (Chiru 153) చిత్రమిది. ఇందులో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాతోపాటు ‘భోళా శంకర్‌’ (మెహర్‌ రమేశ్‌ దర్శకుడు), బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు చిరంజీవి. మరోవైపు,  వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ సినిమాను ఖరారు చేశారు. మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమని ఓ వేదికపై తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని