Puri Musings: 80శాతం జీవితం మీ చేతుల్లోనే కానీ, పొరపాటున పెళ్లి చేసుకుంటే..
రమశిక్షణగా జీవితాన్ని గడిపేవాళ్ల జీవితం 80శాతం వారి చేతుల్లోనే ఉంటుందని, మిగిలిన 20శాతం దేవుడి దయ అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు.
హైదరాబాద్: క్రమశిక్షణగా జీవితాన్ని గడిపేవాళ్ల జీవితం 80శాతం వారి చేతుల్లోనే ఉంటుందని, మిగిలిన 20శాతం దేవుడి దయ అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ‘పూరి మ్యూజింగ్స్’ ద్వారా యూట్యూబ్ వేదికగా పంచుకుంటారాన. తాజాగా ‘లైఫ్ ఇన్ కంట్రోల్’ అనే అంశంపై మాట్లాడారు.
‘‘లైఫ్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. మనం చెప్పినట్టు వినదు. పట్టుకుందామంటే జారిపోతుంది. ఈ అనిశ్చితి వల్ల బీపీ వస్తుంది. కానీ, కొన్ని కొన్ని పనులు చేస్తే, మన జీవితం కొంత కంట్రోల్లో ఉంటుంది. కొంచెం పట్టు సంపాదించవచ్చు. పని ఉన్నా లేకపోయినా, రోజూ ఒక గంట వ్యాయామం చేస్తే, 30శాతం జీవితం మన కంట్రోల్లో ఉంటుంది. దాని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు రావు. ఆస్పత్రిలో గడపాల్సిన అవసరం ఉండదు. మంచి డైట్ తీసుకుంటూ, నీళ్లు ఎక్కువ తాగుతూ ఆల్కహాలు తగ్గిస్తే, మన జీవితం ఇంకొంచెం కంట్రోల్లో ఉన్నట్టే’’
‘‘ఆ తర్వాత మన మైండ్. ఏది తప్పు.. ఏది ఒప్పు.. అనేది మీకు తెలిస్తే, జీవితంలో సగం దరిద్రాలు తగ్గుతాయి. పిచ్చి నమ్మకాలు, భయాలు, అత్యాసలు, మూఢనమ్మకాలు లేకపోతే మీ జీవితం ఇంకా బాగుంటుంది. ఖాళీగా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంటే, జీవితంపై ఇంకొంచెం పట్టు దొరుకుతుంది. సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు. మీ టాలెంట్, మీ క్యారెక్టర్, మీ నిజాయతీ మిమ్మల్ని చాలా వరకూ కష్టాలకు దూరంగా ఉంచుతాయి. ఈ కాస్త పనులు చేస్తే, 80శాతం జీవితం మీ చేతుల్లో ఉంటుంది’’
‘‘మిగిలిన 20శాతం మనం చెప్పలేం. అవతలి వాళ్లు ఎలా స్పందించారు? రోడ్డు మీద కారు వచ్చి ఢీకొట్టిందా? సునామీ వచ్చిందా? వైరస్ వచ్చిందా? యుద్ధం వచ్చిందా? టోర్నడో వచ్చి నిన్ను నేలకేసి కొట్టిందా? ఇలాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. పైన చెప్పినవన్నీ పాటిస్తూ ఏ అడవిలోనో సాధువులా జీవిస్తే, అసలు మీ జాతకం ఏ జ్యోతిష్యుడికి చూపించాల్సిన అవసరం లేదు. ఏ గుడిలోనూ మీ గురించి పూజ చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి మీరు అసలు బరువే కారు. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లంతా చాలా క్రమశిక్షణతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. మనకున్న కష్టాలు వాళ్లకు ఉండవు. మనకంటే హ్యాపీగా ఉంటారు. హాయిగా ఉంటారు. నేను చెప్పేది క్రమశిక్షణ కలిగిన వాళ్లకు 80శాతం జీవితం వాళ్ల చేతిలోనే ఉంటుంది. మిగిలిన 20శాతం దేవుడి దయ. మీరెంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయినా, పొరపాటున పెళ్లి చేసుకుంటే 80శాతం జీవితం మీ చేతుల్లో ఉండదు. మిగిలిన 20శాతం జీవితం కూడా మీ ఆవిడ/భర్త చేతిలోనో ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని పూరి మ్యూజింగ్స్ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్‌ఖాన్‌తో మోహన్‌లాల్
మోహన్‌లాల్ డ్యాన్స్‌ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్‌పై మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్‌కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
మాధురి దీక్షిత్‌తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్‌లో తన కెరీర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్ చిట్